కిటెక్స్ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమిపూజ

కిటెక్స్  టెక్స్‌టైల్‌ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ భూమిపూజ

వరంగల్‌ జిల్లాలో దేశానికే తలమానికంగా నిలిచేలా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరిశ్రమకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌ను టెక్స్‌లైల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిరదన్నారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో 20 వేల మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. మహిళలకు 50 శాతం ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. వరంగల్‌లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు జరుగుతోందని  వెల్లడించారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వరంగల్‌లో కార్యక్రమాలు ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు  కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో వరంగల్‌ జిల్లాలోనే 50 వేల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

 

 

Tags :