అమెరికాకు గురుకుల విద్యార్థులు

అమెరికాకు గురుకుల విద్యార్థులు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీకి చెందిన నలుగురు విద్యార్థులు స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌)లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేసేందుకు ఎంపికయ్యారు. గురుకుల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వమే శాట్‌ శిక్షణ ఇప్పించింది. అందులో భాగంగా గౌలిదొడ్డి గురుకులానికి చెందిన ముంజం లావణ్య, నాలిక హారిక, చైతన్య, నార్సింగి గురుకులానికి చెందిన స్వాప్నిక శాట్‌లో అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, శాట్‌ శిక్షకుడు మూర్తి పొలాస, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ గ్రేసినా ప్రకాశ్‌, ఇతర సిబ్బందిని గురుకులాల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ ప్రత్యేకంగా అభినందించారు.

 

Tags :