ప్రముఖ శాస్త్రవేత్త స్వాతి పిరమాల్‌కు అత్యున్నత పురస్కారం

ప్రముఖ శాస్త్రవేత్త స్వాతి  పిరమాల్‌కు అత్యున్నత పురస్కారం

ప్రముఖ భారత శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరమాల్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. వాణిజ్యం, పరిశ్రమలు, సైన్స్‌, ఔషధ రంగాల్లో సేవలు, భారత్‌` ఫ్రాన్స్‌ సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న పిరమాల్‌ గ్రూప్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా స్వాతి పిరమాల్‌ (66) వ్యవహరిస్తున్నారు. ఈ వారంలో ఫ్రాన్స్‌ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాధరిన్‌ కోలోనా భారత పర్యటనలో స్వాతి పిరమాల్‌కు  ది చెవాలియర్‌ డి లా లీజియన్‌ డిహానర్‌ ఆర్‌ నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌ పురస్కారాన్ని అందించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్యాన్యుయేల్‌ మ్యాక్రన్‌ తరపున ఆమె ఈ అవార్డును బహుకరించారు.

 

Tags :