వన్యప్రాణ సంరక్షణ కోసం పని చేసే వారికి ఉచిత వైద్యం : ఉపాసన కొణిదెల ఇంస్టాగ్రామ్ పోస్ట్

వన్యప్రాణ సంరక్షణ కోసం పని చేసే వారికి ఉచిత వైద్యం : ఉపాసన కొణిదెల ఇంస్టాగ్రామ్ పోస్ట్

ఉపాసన కొణిదెల తాజాగా అపోలో ఉచిత వైద్య సేవల గురించి చెప్పుకొచ్చారు. మెగా కోడలు ఉపాసన కొణిదెల మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఆమెకున్న సామాజిక స్పృహ అపరిమితం. వన్యప్రాణ సంరక్షణ  జీవ రాశులు, మూగ జంతువులు, ప్రకృతి పరిరక్షణ, పేదలకు ఉచిత వైద్యం వంటి వాటిపై ఉపాసన ఎక్కువగా దృష్టిని సారిస్తుంటారు. ఉపాసన చేసే సేవా కార్యక్రమాల వల్లే ఆమెకు ఇంతటి అభిమాన గణం ఏర్పడింది. మెగా కోడలిగా ఉపాసన తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉంటారు. మెగా ఫ్యామిలీ ప్రతిష్టను ఒక మెట్టు పైకి తీసుకెళ్లేలా ఉపాసన ప్రవర్తిస్తుంటారు. అపోలో వైద్య సేవల గురించి తాజాగా ఉపాసన ఓ పోస్ట్ వేశారు.

ఉపాసన వైల్డ్ లైఫ్ అన్నా, వన్య ప్రాణుల సంరక్షణ అన్నా ఎంతో ఇష్టం. ఉపాసన ఇంట్లో, ఫాం హౌస్‌లో రకరకాల జంతువులున్నాయి. ఇక జూలో ఉన్న ఎన్నో జంతువులను కూడా ఆమె దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఉపాసన గతంలో ఓ సారి పులి పిల్లను ఒళ్లో పెట్టేసుకుంది. దానికి పాలు పట్టేసింది. ఆ సమయంలో ఉపాసన గట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా ఉపాసన తన మంచి మనసును చాటుకున్నారు. జంతుప్రేమికురాలైన ఉపాసన.. ఆ కోణంలోంచి ఆలోచించారు. జంతువుల సంరక్షణ కోసం, వన్యప్రాణి సంరక్షణ కోసం పని చేసి వారికి ఉపయోగ పడే కార్యక్రమాన్ని చేపట్టారు. వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, జీవ రాశుల పోషణ, సంరక్షణ కోసం పని చేసే వారికి ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని ఉపాసన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందు కోసం అపోలో ఫౌండేషన్, డబ్లూడబ్లూఎఫ్‌ (WWF)తో కలిసి పని చేయనుందట. ఈ మేరకు ఉపాసన ఓ పోస్ట్ వేశారు.

Upasana Konidela Insta post:

https://www.instagram.com/p/CfL_oVCBS3f/

 

Tags :