నాట్స్ అధ్యక్షుడు శ్రీ నూతి బాపయ్య చౌదరి కి ఘన సత్కారం..

నాట్స్ అధ్యక్షుడు శ్రీ నూతి బాపయ్య చౌదరి కి ఘన సత్కారం..

శ్రీ నూతి బాపయ్య చౌదరి (బాపు) పెదనందిపాడు గ్రామస్తుడు, తాను దిగువ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించి వారి తల్లిదండ్రుల ప్రోత్సహముతో ఎలిమెంటరీ స్కూల్ లో ఐదో తరగతి వరకు మరియు పెదనందిపాడు జిల్లా పరిషత్ హైస్కూలు లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు, పి ఏ యస్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేశారు. అన్ని తరగతులలో మంచి మార్కుల తో ఉత్తీర్ణత సాధించినారు.

నాగార్జున యూనివర్సిటీలో యం యస్ సి మ్యాథమేటిక్స్ లో.చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై కొద్దీ నెలలపాటు పి ఏ యస్ కళాశాలలో గణిత లెక్చరర్ గా పని చేసి, అదే సమయంలో కంప్యూటర్ సైన్స్ లో ప్రావీణ్యం సంపాదించి మలేషియా లో రెండున్నర సంవత్సరంల పాటు ఉద్యోగం చేసినారు. తరువాత అమెరికా వెళ్లి కంప్యూటర్ విభాగాల్లో ఉద్యోగి గా స్థిరపడి అంచెలంచలుగా ఎదిగి అమెరికాలో ఉన్న డల్లాస్ లో నివాసం వుంటూన్నారు. వారు అమెరికా లో ఉన్న విద్యార్థులకు తన వంతు సేవ చేస్తూ నాట్స్ సంస్థలో క్రియాశీలక సభ్యునిగా చేరి పట్టుదలతో సేవ కార్యక్రమాలను చేసి నాట్స్ సభ్యుల అభిమానాన్ని చూరగొన్నారు మరియు నాట్స్ అధ్యక్షుడుగా పదవిని అలంకరించారు.

వారు స్వగ్రామం వచ్చిన సందర్భంగా పెదనందిపాడు కళాశాల అధ్యక్షుడు శ్రీ కాళహస్తి సత్యనారాయణ గారు వారి కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత పోలీసు అధికారుల సంఘం, మరియు మిత్రులు ఘనంగా గుంటూరులోని సత్య ఇన్వెస్టిగేషన్ మరియు సెక్యురిటి సర్వీసెస్ ఆఫీస్ లోను మరియు ఐటీసీ వెల్కమ్ హోటల్ లో గజమాలతోను పుష్పగుచ్చాలతో, శాలువాలను కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి సత్యనారాయణ, శ్రీ ఏ రవిచంద్ర ఐ పి యస్, రిటైర్డ్ ఐజిపి, యు మాణిక్యలారావు, రిటైర్డ్ ఎస్పీ, కెవి నారాయణ, రిటైర్డ్ డి యస్ పి, సుబ్బారెడ్డి, రిటైర్డ్ డి యస్ పి , ఎన్ వి బ్రహ్మయ్య, కాకుమాను నాగేశ్వరరావు తదితరులు పాల్గొని బాపయ్య చౌదరి ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలని కోరినారు.

 

Click here for Photogallery

 

Tags :