జి 7 దేశాలకు చైనా హెచ్చరిక

జి 7 దేశాలకు చైనా హెచ్చరిక

తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని పశ్చిమ దేశాలు, జీ7 దేశాలను చైనా హెచ్చరించింది. హాంకాంగ్‌ ఎన్నికలపై జి7 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ఈ హెచ్చరికలు చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జో లిజైన్‌ మీడియాతో మాట్లాడుతూ హాంకాంగ్‌ ఎన్నికలపై ఆపవాదు వేయడానికి, చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కొన్ని పాశ్చాత్య దేశాలు, సంస్థలు కుట్ర పన్నుతున్నాయి.  చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది అని తెలిపారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం వృద్ది చెందిందని కొన్ని దేశాలు మర్చిపోయాయని అన్నారు.

హాంకాంగ్‌లో గందరగోళం సృష్టించి చైనాను ఇబ్బంది పెట్టడానికి కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. హాంకాంగ్‌ చైనాకు చెందినది హాంకాంగ్‌లో ఎలాంటి ఎన్నికల వ్యవస్థను అమలు చేయాలి. అక్కడ ప్రజాస్వామ్య అభివృద్ధి మార్గాన్ని అన్వేషించడం ఇవి పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారాల పరిధిలోకి వచ్చే అంశాలు. ఇందులో ఎటువంటి బాహ్య శక్తులకు జోక్యం చేసుకునే హక్కు లేదు అని స్పష్టం చేశారు.

 

 

Tags :