కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర

కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర

కల్నల్‌ బి.సంతోష్‌ బాబు (మరణానంతరం)కు మహావీర చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులు మీదుగా సంతోష్‌ బాబు భార్య సంతోషి, తల్లి మంజుల ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను గ్యాలంట్రీ అవార్డులు, విశిష్ట సేవా పతకాలను అందజేశారు. బీహార్‌ రెజిమెంట్‌ (మరణానంతరం) 16వ బెటాలియన్‌ కల్నల్‌ బికుమళ్ల సంతోష్‌ బాబు ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని చురుకైన వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించాడని రాష్ట్రపతి పేర్కొన్నారు. గాల్వాన్‌ వ్యాలీ (తూర్పు లడఖ్‌)లో భారత్‌, చైనా సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సంతోష్‌ బాబు అమరుడైన సంగతి తెలిసిందే.

 

Tags :