తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...నేటి నుంచి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...నేటి నుంచి

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కానీ సర్జరీలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర శస్త్రచికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

 

Tags :