మాల్ ఆఫ్ ఇండియా లో వైభవంగా గణపతి పూజలు

మాల్ ఆఫ్ ఇండియా లో వైభవంగా గణపతి పూజలు

అగ్రరాజ్యం అమెరికాలో పలుచోట్ల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇల్లినాయిస్ లోని మాల్ ఆఫ్ ఇండియా లో సెప్టెంబర్ 2, శుక్రవారం నాడు, గణేష్ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు దాండియా నృత్యాలతో గణేష్ ఉత్సవాన్ని జరుపుకున్నారు. రోజువారీ దర్శనం, పూజ, పిల్లల కార్యకలాపాలు, సాంస్కృతిక నృత్యాలు, భజనలు, గణపతి పూజ, లక్ష్మీ పూజ మరియు గణపతి హోమం వంటి విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిన భక్తులను వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించిన వినోజ్ చనమోలు.. దగ్గరుండి వినాయక పూజలు చేయించారు. ఇక్కడకు వచ్చిన భక్తులందరూ గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసినందుకు కతజ్ఞతలు తెలిపారు. 

 

Tags :