న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం

న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం

అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం శ్రీ శివ, విష్ణు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను కన్నులపండువగా జరిపింది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దడంతో ఆ వైభవాన్ని తిలకించడానికి భక్తులు నిత్యం ఎడిసన్‌లోని శ్రీ శివ, విష్ణు మందిరానికి భక్తులు భారీగా వచ్చారు. గణేశ్ ఉత్సవాల చివరి రోజు గణనాథుడికి, భక్తులు * జై బోలో గణేశ్ మహారాజ్* నినాదాల మధ్య అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం జరిగింది. డప్పు వాయిద్యాల హోరు, భక్తుల ఆనందంతో చేసిన నృత్యాలతో ఎడిసన్ వీధుల్లో ఎన్నడూ చూడని కొత్త సందడి కనిపించింది.

న్యూజెర్సీ సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జరిగిన ఈ గణేశ్ ఉత్సవాలకు భక్తులు తొమ్మిది రోజుల పాటు భారీగా హాజరై ఆ గణనాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ శివ, విష్ణు మందిరంలో శ్రీ హేరంభ పంచముఖ గణపతిగా ఆ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.. ప్రతి యేటా గణేశ్ ఉత్సవాలను ఘనంగా జరిపే సాయి దత్త పీఠం ఈ సారి కూడా నూతనంగా నిర్మించిన శ్రీ శివ, విష్ణు ఆలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం విశేషం. ఎడిసన్ నడిబొడ్డున ఈ ఆలయం ఉండటంతో భక్తులంతా గణేశ్ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

 

Tags :