గార్గి మూవీ లో టీచర్‌గా అదరగొట్టేసిన సాయిపల్లవి : ట్రైలర్‌ రిలీజ్

గార్గి మూవీ లో టీచర్‌గా అదరగొట్టేసిన సాయిపల్లవి :  ట్రైలర్‌ రిలీజ్

సాయి పల్లవి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గార్గి'. జులై 15న ఈ సినిమా రిలీజ్ కానుండగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా నేడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇందులో సాయిపల్లవి టీచర్‌గా..గార్గి మూవీతో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి  ఆడియన్స్ ముందుకు రానుంది. జులై 15న విడుదల కానుండగా.. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ను నేచురాల్ స్టార్ నాని , రానా దగ్గుబాటి  లాంచ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. . గౌతమ్‌ రామచంద్రన్‌ డైరెక్షన్‌లో లేడీ ఓరియెంటెడ్‌‌ డ్రామాగా రూపొందించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, సాయి పల్లవి ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలకు ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా సాయి పల్లవి తన యాక్టింగ్‌తో అదరగొట్టేసింది.'విడుదలకు ముందే ఈ అందమైన సినిమాను చూసేయాలి. గార్గి సినిమా థ్రిల్లింగ్, గ్రిప్పింగ్‌గా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాయి పల్లవి తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది..' అంటూ హీరో నాని ట్వీట్ చేశాడు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఏదైనా తనదైన శైలితో మెప్పించే సాయిపల్లవి.. గార్గి మూవీలో టీచర్‌గా నటిస్తోంది. తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనను కేసు నుంచి విడిపించుకునేందుకు సాయి పల్లవి ఎదుర్కొన్న కష్టాలను చూపించినట్లు తెలుస్తోంది. ఒక రోజులో తమ జీవితం తలకిందులైందంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. న్యాయం కోసం పోరాడే గార్గి క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. రామ‌చంద్రన్, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ నిర్మించగా.. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స్టార్ హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు.

 

Tags :