MKOne Telugu Times Business Excellence Awards

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ టాప్‌ 20కి వచ్చారు. 64.2 బిలియన్ల సంపదతో గౌతమ్‌ అదానీ ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. జనవరి 24కు ముందు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ నివేదిక జనవరి 24న వెలువడిరది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చాలా తీవ్రమైన ఆరోపనలు చేసింది.  అకౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నదని, డొల్ల కంపెనీల సహాయంతో నిధుల మళ్లింపు జరిగిందని, కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుతున్నారని, గ్రూప్‌ కంపెనీల రుణ భారం చాలా ఎక్కువగా ఉందని ఇలా అనేక ఆరోపణలో జనవరి 24న నివేదిక వెల్లడిరచింది.  దీంతో అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 26వ స్థానానికి పడిపోయారు. ఇటీవల మూడు రోజులుగా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక అదానీ గ్రూప్‌కు అనుకూలంగా ఉందన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. 

 

 

Tags :