జెఫ్ బేజోస్ను వెనక్కి నెట్టిన అదానీ... ప్రపంచ కుబేరుల్లో

జెఫ్ బేజోస్ను వెనక్కి నెట్టిన అదానీ... ప్రపంచ కుబేరుల్లో

గౌతం అదానీ ఇప్పుడు ప్రపంచంలో నెంబర్‌ 2 సంపన్నుడిగా నిలిచాడు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది. అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బేజోస్‌ను అదానీ వెనక్కి నెట్టేశారు. లూయిస్‌ విట్టాన్‌ ఓనర్‌ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ను కూడా అదానీ దాటేశాడు. ప్రస్తుతం గౌతమి అదానీ ఆస్తుల విలువ 155.7 బిలియన్ల డాలర్లు. ఇక టాప్‌ నెంబర్‌లో ఉన్న ఎలన్‌ మాస్క్‌ ఆస్తుల విలువ 273.5 బిలియన్ల డాలర్లు. గత నెలలో మూడవ స్థానంలో ఉన్న అదానీ లాయిస్‌ విట్టాన్‌ ఓనర్‌ను దాటేసి  ఇప్పుడు రెండవ స్థానంలోకి చేరుకున్నారు. అర్నాల్ట్‌ ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 153.5 బిలియన్ల డాలర్లు. నాలుగవ స్థానంలో ఉన్న బేజోస్‌ ఆస్తుల విలువ 149.7 బిలియన్ల డాలర్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్‌ అంబానీ 92 బిలియన్ల డాలర్లతో 8వ స్థానంలో నిలిచారు.

 

Tags :