అదానీ ఇంట పెళ్లి సందడి

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీకి, దవా జైమిక్ షా తో అహ్మదాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. దివా, గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పెళ్లి తేదీ వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ వేడుకపై ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
Tags :