అమెరికాకు ముప్పు.. బుష్‌ హెచ్చరిక

అమెరికాకు ముప్పు.. బుష్‌ హెచ్చరిక

అమెరికాకు అంతర్గత శక్తులతోనే ముప్పు పొంచి ఉందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ హెచ్చరించారు. బహుళత్వంపై వ్యతిరేకత, మానవ ప్రాణాలకు విలువివ్వకపోవడం, జాతీయ చిహ్నాలను అవమానపరచడం లాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయని అన్నారు. 9/11 దాడుల సమయంలో చూపిన సమైక్య స్ఫూర్తి ప్రస్తుతం దేశంలో కొరవడిరదని ఆవేదన వ్యక్తపరిచారు. రాజకీయ వాతావరణం భయానకంగా మారిందని, మనుషుల మధ్య ద్వేషం పెరిగిందని తెలిపారు. అమెరికా ప్రజలు ఐక్యం కావాలని, 9/11 దాడుల సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం చూపిన సమైక్య స్ఫూర్తిని మళ్లీ కనబరచాలని కోరారు. 

 

Tags :