MKOne Telugu Times Business Excellence Awards

సీఎం వైఎస్ జగన్ తో జర్మనీ కాన్సుల్ జనరల్ భేటీ

సీఎం వైఎస్ జగన్ తో జర్మనీ కాన్సుల్ జనరల్ భేటీ

భారత్‌లో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారు చర్చించినట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలను అందించేందుకుకైనా సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపినట్లు వెల్లడించారు. ఉత్పత్తి` పారిశ్రామికాభివృద్ధి, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ అండ్‌ సస్టెయినబిలిటీ, ఆటోమోటివ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, విద్య-పరిశోధన వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు కాన్సుల్‌ జనరల్‌ కుచ్లర్‌ సీఎంకు తెలిపినట్లు సీఎంఓ వెల్లడించింది.

 

 

Tags :