తొలిసారిగా తన వారసురాలితో.. బహిరంగంగా కిమ్

తొలిసారిగా తన వారసురాలితో.. బహిరంగంగా కిమ్

ఉత్తర కొరియా ఇటీవల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్యాసంగ్‌-17 ప్రయోగం సందర్భంగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చేయి పట్టుకుని చిన్నారి ఆయన రెండో కుమార్తె జూ ఈ (10) అని దక్షిణ కొరియా అంటోంది. కిమ్‌ వ్యక్తిగత విషయాలేవీ బయటి ప్రపంచానికి అంతగా తెలీదు. కిమ్‌కు ముగ్గురు సంతామని 2013లో ఆయనతో భేటీ అయిన బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రాడ్‌మన్‌ తెలిపారు. వారిలో జూ ఈ అనే కూతురు కూడా ఉన్నట్లు ఆయన గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా ఎన్‌ఐఎస్‌ కూడా ధ్రువీకరించింది. ఆ వయస్సు బాలికల కంటే ఆమె పొడుగ్గా, పెద్దగా కననిపించినందునే ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. తన వారసురాలు అమే నని చెప్పేందుకు బయటి ప్రపంచానికి చూపించి ఉంటారంటోంది. కిమ్‌ తాత, తండ్రి కూడా తమ వారసులను ఇలాగే పరిచయం చేశారని గుర్తు చేస్తోంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.