అమెరికా మార్కెట్ లో వోకార్డ్ ఔషధాలు

అమెరికా మార్కెట్ లో వోకార్డ్ ఔషధాలు

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, యూఎస్‌ మార్కెట్లో వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన కొన్ని ఔషధాలను కొనుగోలు చేసింది. యూఎస్‌ లోని తన అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌ మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌, ద్వారా ఈ ఔషధాలు సొంతం చేసుకున్నట్లు గ్లెన్‌ మార్క్‌ ఫార్మా వెల్లడించింది. ఇందులో ఫమోటిడిన్‌ ట్యాబ్లెట్‌, సిట్రిజెన్‌ హైడ్రోక్లోరైడ్‌, లాన్సోప్రజోల్‌, ఓలోపటడిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఆప్తాల్మిక్‌ సొల్యూషన్‌ ఉన్నాయి. అమెరికా మార్కెట్లో 175 ఔషధాలు విక్రయించడానికి  గ్లెన్‌ మార్క్‌ ఫార్మాకు అనుమతి ఉంది. దీనికి తోడు అవకాశం ఉన్నంత మేరకు ఔషధాల సంఖ్యను పెంచుకునేందుకు భాగస్వామ్యాలు, కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది.

 

Tags :