స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో గోవా అసెంబ్లీ స్పీకర్ భేటీ

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో గోవా అసెంబ్లీ స్పీకర్ భేటీ

గోవా అసెంబ్లీ స్పీకర్‌ రాజేష్‌ పట్నేకర్‌ నేతృత్వంలో ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, అధికారుల నేతృత్వంలోని సభ్యుల బృందం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. అధికార స్టడీ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌ విచ్చేసిన గోవా బృందం ముందుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ పనితీరు, ప్రత్యేకతలను స్పీకర్‌ పోచారం గోవా బృందానికి వివరించారు. ఈ భేటీలో తెలంగాణ స్టేట్‌ లెజిస్లేటివ్‌ సెక్రటరీ డా.వి.నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.

 

Tags :