కాలిఫోర్నియాలో ఘనంగా గోల్డెన్ గ్లోబ్ వేడుకలు...

కాలిఫోర్నియాలో ఘనంగా గోల్డెన్ గ్లోబ్ వేడుకలు...

ఈ యేటి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను ప్రకటించారు. నోమాడ్‌ల్యాండ్‌, బోర్టా సినిమాలకు టాప్‌ అవార్డులు దక్కాయి. బెస్ట్‌ పిక్చర్‌, బైస్ట్‌ డైరక్టర్‌ అవార్డులను నోమాడ్‌ల్యాండ్‌ ఎగురేసుకుపోయింది. చోలే జావోకు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. కాలిఫోర్నియాలో ఘనంగా గోల్డెన్‌ గ్లోబ్‌ వేడుకలను నిర్వహించారు. నోమాడ్‌ల్యాండ్‌లో హీరోయిన్‌ ఫ్రాన్సెస్‌ మెక్‌డార్మాండ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఇల్లు లేని ఓ మహిళ..పశ్చిమ అమెరికాలో పర్యటిస్తుంది. ఆ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మహిళా డైరక్టర్‌ చాలే జావో ఈ సినిమాకు డైరక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. గోల్డెన్‌ గ్లోబ్‌ చరిత్రలో డైరెక్షన్‌ అవార్డును ఓ మహిళ గెలుచుకోవడం ఇది రెండవ సారి. 1983 లో బార్బ్రా స్ట్రీశాండ్‌ ఈ అవార్డును దక్కించుకున్నారు. 2006లో రిలీజై సక్సెస్‌ సాధించిన బోర్టాకు సీక్వెల్‌గా వచ్చిన బోర్టాకు బెస్ట్‌ మ్యూజికల్‌-కామిడీ అవార్డు దక్కింది.

 

Tags :