మనసు మార్చుకున్న బ్రిటన్...భారత ప్రయాణికులకు ఊరట

మనసు మార్చుకున్న బ్రిటన్...భారత ప్రయాణికులకు ఊరట

భారత్‌ దెబ్బకు బ్రిటన్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. అక్టోబర్‌ 11 నుంచి కొవిషీల్డ్‌ లేదా యూకే ప్రభుత్వం ఆమోదించిన ఇతర టీకా వేసుకుని ఆ దేశానికి వెళ్లే భారత ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్‌ హై కమిషన్‌ వెల్లడిరచింది. గతంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు టీకా తీసుకున్నప్పటికీ 10 రోజుల పాటు క్వారంటైన్‌ ఉండాలని యూకే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ కూడా ఈ నెల 4 నుంచి మన దేశానికి వచ్చే బ్రిటన్‌ పౌరులకు ఇవే ఆంక్షలను అమలు చేస్తామని ప్రకటించింది.

 

Tags :