రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ఇండియన్‌ రైల్వేస్‌లో పనిచేస్తున్న నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాన్‌ గెజిటెడ్‌ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్‌గా ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో 11.56 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఖజానాపై రూ.1985 కోట్ల మేర భారం పడనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ సహా పలు అంశాలను ఈ భేటీ చర్చించారు.

 

Tags :