ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభించింది. ఈ నంబరుకు కాల్‌ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాదారులు వివిధ రకాల ఆర్థిక సేవలు ఇంటి వద్ద నుంచే సులభంగా పొందొచ్చు. దీంతో ప్రాథమిక బ్యాంకింగ్‌ కార్యకలాపాల కోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి సమయం ఆదా అవుతుంది. ఎస్‌బీఐ కొత్త టోల్‌ ఫ్రీ నంబరు 1800 1234. ప్రయాణ సమయంలో బ్యాంకింగ్‌ సాయం కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుర్తుంచుకోవడం కూడా చాలా సులభం. ఈ కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించి ఎస్‌బీఐ ఖాతాదారులు.. ఖాతా బ్యాలెన్స్‌, చివరి 5  లావాదేవీలు వివరాలు, ఏటీఎం కార్డ్‌ బ్లాకింగ్‌, డిస్పాచ్‌ స్టేటస్‌, బెక్‌బుక్‌ డిస్పాచ్‌ స్టేటస్‌, టీడీఎస్‌ వివరాలు, పాత కార్డు బ్లాక్‌ చేసిన తర్వాత కొత్త ఏటీఎం కార్డుకి అభ్యర్థించడం వంటి సేవలను పొందొచ్చు అని తెలిపింది.

 

Tags :