తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. మళ్లీ వారు వీధుల్లోకి

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. మళ్లీ వారు వీధుల్లోకి

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి నుంచే ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో పని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్ల విధులు నిర్వర్తించనున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Tags :