గూగుల్ సీఈవోపై కాపీరైట్ కేసు

గూగుల్ సీఈవోపై కాపీరైట్ కేసు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సహా సంస్థలో పనిచేస్తున్న మరో అయిదుగురు అధికారులపై కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఏక్‌ హసీనా తి ఏక్‌ దివాన థా సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్‌ అనుమతించిందని ప్రముఖ దర్శకుడు సునీల్‌ దర్శన్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది.

 

Tags :