గూగుల్ సీఈవో కీలక ప్రకటన

గూగుల్‌కి సవాల్‌గా దూసుకొచ్చిన చాట్‌జీపీటీకి చేదువార్త. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులతో శరవేగంగా వస్తున్న చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐకి చెక్ చెప్పేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్ బార్డ్‌ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌కు కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఈ ఏఐ సర్వీస్ బార్డ్‌ను రిలీజ్ ఓపెన్ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్ల డించారు. ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్‌గా విడుదల చేస్తామని తెలిపారు.
Tags :