భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ

భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుందర్‌ పిచాయ్‌ అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు తో భేటీ అయ్యారు. భారత్‌లో గూగుల్‌ కార్యకలాపాలు, ప్రధానంగా దేశంలో డిజిటలీకరణ కంపెనీ చేస్తున్న కృషికి సంబంధించి సంధుతో పిచాయ్‌ చర్చించారు. యూఎస్‌ టెక్నాలజీ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల్లో ఇండియన్‌ ఎంబసీని సందర్శించిన మొదటి వ్యక్తి పిచాయే. వాషింగ్టన్‌ డీసీలోని ఈ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం తరుణ్‌ జీత్‌ సింగ్‌ సంధుకు ధన్యవాదాలు తెలిపారు పిచాయ్‌. మీతో సంభాషించడం గొప్పగా ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Tags :