విడాకులకు సిద్ధమైన మరో కుబేరుడు

విడాకులకు సిద్ధమైన మరో కుబేరుడు

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అమెజాన్‌ చైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ బాటలోనే మరో కుబేరుడు భార్యతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆరో వ్యక్తి, ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సహ వ్యవస్థాపకుడైన సెర్గె బ్రిన్‌ (48)తన భార్య నికోల్‌ షానాహన్‌కు విడాకులు ఇవ్వనున్నారు. మూడేళ్ల తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకోవాలని ఈ నెలలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచాలని కోర్టును బ్రిన్‌ కోరారు. బ్రిన్‌, నికోల్‌ దంపతులకు ఓ కొడుకు (3) కూడా ఉన్నాడు. బ్రిన్‌ సంపద  విలువ దాదాపు రూ.73 లక్షల కోట్లు. తన మొదటి భార్య అన్నే వోజికీకి బ్రిన్‌ 2015లో విడాకులిచ్చారు.

 

Tags :