గూగుల్లో అనూహ్య పరిణామం

దిగ్గజ సంస్థ గూగుల్‌లోని మావన వనరుల విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అనూహ్య పరిస్థితుల్లో లేఆఫ్ సందేశం అందింది. డాన్ లానిగాన్ ర్యాన్ అనే ఆ వ్యక్తి సంస్థ కోసం ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగానే, అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ`మెయిల్ వచ్చింది. ఫోన్‌లో ర్యాన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్ కట్ అయింది. సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. తనతో పాటు మరికొందరికి ఈ పరిస్థితి ఎదురైంది. ఇదొక సాంకేతిక లోపంగా మేనేజర్ భావించినట్లు ర్యాన్ చెప్పారు. అయితే ఈ వెంటనే ఈ`మెయిల్ ద్వారా లేఆప్ సందేశం వచ్చినట్లు తెలిపారు.
Tags :