గూగుల్‌ కు భారీ షాక్!

గూగుల్‌ కు భారీ షాక్!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ కు భారీ షాక్‌ తగిలింది. గూగుల్‌ ఇండియా పాలసీ హెడ్‌ అర్చన గులాటీ తన పదవికి రాజీనామా చేశారు. విధుల్లో చేరిన 5 నెలల తర్వాత ఆమె తన పదవికి రాజజీనామా చేయడం చర్చాంశనీయంగా మారింది. అయితే రాజీనామాపై అర్చన, గూగుల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎకనమిక్స్‌ గ్రాడ్యుయేట్‌గా, ఐఐటీ-ఢిల్లీ పీహెచ్‌డీ పూర్తి చేసిన అర్చన గులాటీ నీతి ఆయోగ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో జాయింట్‌ సెక్రటరీగా, అడ్వైజరీగా బాధ్యతలు నిర్వహించారు. అయితే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రిటైర్మెంట్‌ ప్రకటించి ఈ ఏడాది మే లో గూగుల్‌ ఇండియా పాలసీ హెడ్‌గా చేరారు. ఈ క్రమంలో అర్చన గులాటీ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కాగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ దేశంలో రెండు యాంటీట్రస్ట్‌ కేసులతో పాటు కఠినమైన నిబంధనల్ని ఎదుర్కొంటోంది.  ఈ సమయంలో గులాటీ గుడ్‌ బై చెప్పడం గూగుల్‌కు గట్టి ఎదురు దెబ్బేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.