ఉద్యోగులకు గూగుల్ షాక్

ఉద్యోగులకు గూగుల్ షాక్

టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ పనితీరు సరిగాలేని 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ తొలగింపు ప్రక్రియ షురూ కానుంది. గూగుల్‌ తన ఉద్యోగులతో 6 శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 వేల మంది పనితీరు సాకుతో ఇంటికి పంపించనుంది. గూగుల్‌ ర్యాంకింగ్‌ సిస్టమ్‌ ద్వారా త్యల్ప ర్యాంక్‌ ఉన్న ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించాలని భావిస్తోంది. ఉద్యోగులను విశ్లేషించి, ర్యాంక్‌ ఇవ్వాల్సిందిగా సంస్థ మేనేజర్‌ను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్‌ కొత్త పనితీరు సిస్టం బోనస్‌లు స్టాక్‌ గ్రాంట్‌లను చెల్లించకుండా ఉంచేందుకు ఈ రేటింగ్స్‌ను ఉపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఆల్ఫాబెట్‌ ఇంకా స్పందించలేదు.

 

Tags :
ii). Please add in the header part of the home page.