గూగుల్ శుభవార్త ..

ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్ మన దేశంలో నియామకాలు చేపడుతోంది. ప్రస్తుత కేంద్రాల విస్తరణతో పాటు పుణెలో ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ కేంద్రాల్లో వేగంగా విస్తరిస్తున్నామని, అదనంగా పుణెలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు అనిల్ బన్సాలీ తెలిపారు. ఇందుకోసమే నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్యోగార్థులు తమ అధీకృత పోర్టల్లో వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Tags :