విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు!

రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాల్‌కృష్ణ గాంధీ పేరు వినిపిస్తోంది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్‌కృష్ణ గాంధీ పోటీలో నిలపాలనే ప్రతిపాదనను వామపక్ష పార్టీలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఐఏఎస్, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్‌కృష్ణ గాంధీ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పని చేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ గాంధీ పోటీ చేశారు. అయితే ఆ సమయంలో వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రతిగా గెలుపొందారు.
Tags :