భారత్ బయోటెక్ కీలక ప్రకటన

భారత్ బయోటెక్ కీలక ప్రకటన

భారత్‌ బయోటెక్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తయారీపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. టీకాలపై అవగాహన లేని వారు కోవాగ్జిన్‌ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ సంస్థ పేర్కొన్నది. కోవాగ్జిన్‌ తయారీ కోసం తమపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆ సంస్థ తెలిపింది. సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్‌ను తయారు  చేసేందుకు మాత్రమే తాము ఒత్తిడికి గురైనట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఎంతో అధ్యయనం తర్వాత కోవిడ్‌ 19 వ్యాధికి కోవాగ్జిన్‌ టీకాను తయారు చేసినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.