యువత వారి చరిత్ర తెలుసుకోవాలి : గవర్నర్ తమిళి సై

యువత వారి చరిత్ర తెలుసుకోవాలి : గవర్నర్ తమిళి సై

యువత చదువుతోపాటు దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన యోధుల చరిత్రనూ తెలుసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె సాలార్‌ జంగ్‌ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయచిత్ర ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భగా గవర్నర్‌ మాట్లాడుతూ జాతీయ జెండా రూపకల్పనలో కృషి చేసిన సిస్టర నివేదిత, డాక్టర్‌ అనిబిసెంట్‌, పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. సాలార్‌ జంగ్‌ మ్యూజియంను సందర్శించే వారిలో ఈ ప్రదర్శన దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. గతంలో ఏడాదిలో ఒక్కరోజే జెండా పండుగ వచ్చేదని, ఇప్పుడు ఏడాదంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే అదృష్టం కలిగిందంటూ తమిళి సై సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 38 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను ఈ ప్రదర్శనలో సంక్షిప్త వివరాలతో (ఫోటోలతో) ఏర్పాటు చేశారు.

 

Tags :