కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో నాలుగు నెలల పాటు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో నాలుగు నెలల పాటు పొడిగింపు

రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద అందిస్తున్న ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని మార్చి 2022 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఈ ఉచిత రేషన్‌ కార్యక్రమాన్ని 2022 మార్చి వరకు అందించడానికి ప్రధాని గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజనను పొడిగించాలని కేంద్రం కేబినెట్‌ నిర్ణయించినట్లు ఠాకూర్‌ తెలిపారు.  గతేడాది కోవిడ్‌ 19 వల్ల విధించిన లాక్‌డౌన్‌ దృష్ట్యా పెద ప్రజలకు ఉచితంగా  రేసన్‌ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు నెలలు పొడగించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్‌ నుంచి ఉచితంగా రేషన్‌ సరఫరా చేస్తుంది.

 

Tags :