రాజీవ్ హత్య దోషుల విడుదలపై సీరియస్.. సుప్రీం నిర్ణయాన్ని సవాల్ చేసిన కేంద్రం

రాజీవ్ హత్య దోషుల విడుదలపై సీరియస్.. సుప్రీం నిర్ణయాన్ని సవాల్ చేసిన కేంద్రం

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ కేసులో ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు ఇటీవల విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దోషులకు విడుదల చేసిన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని పిటీషన్ లో కోరింది. ఈ కేసు విషయంలో కోర్ట్ జారీ చేసిన ఆదేశాల్లో చాలా లోపాలు ఉన్నాయని, కాబట్టి దోషుల విడుదలపై వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు విముక్తి ప్రసాదిస్తూ గతవారమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత రాజీవ్ హత్య కేసు దోషులు విడుదలయ్యారు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.