కేంద్రం కీలక నిర్ణయం...15 నుంచి విదేశీయులకు అనుమతి

కేంద్రం కీలక నిర్ణయం...15 నుంచి విదేశీయులకు అనుమతి

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి అక్టోబరు 15 నుంచి విదేశీ పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు వీసాలు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, విదేశీయులు చార్టర్డ్‌ విమానాల్లో వచ్చేందుకు మాత్రమే అనుమతి వర్తిస్తుంది. సాధారణ విమానాల్లో రావడానికి నవంబరు 15 నుంచి అనుమతించనున్నారు.  ఈ మేరకు కేంద్ర హోంశాఖ తెలిపింది.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీయులకు అన్ని రకాల వీసాలను కేంద్రం గతేడాది నిలిపివేయడం తెలిసిందే.

 

Tags :