కేంద్రానికి అందిన స్విస్ ఖాతాదారుల 3వ జాబితా

కేంద్రానికి అందిన స్విస్ ఖాతాదారుల  3వ జాబితా

స్విస్‌ బ్యాంకులో భారతీయుల అకౌంట్లకు సంబంధించిన మూడో విడత జాబితాను కేంద్రానికి స్విట్జర్లాండ్‌ సమర్పించింది. ఇందులో మనదేశానికి చెందిన అనేక మంది వ్యాపారవేత్తలు, కంపెనీలు, వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైల అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పలువురు ఎన్నారైల అకౌంట్ల వివరాలు జాబితాలో ఉన్నాయి. దీనికి అదనంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిన సుమారు వంద మంది భారతీయుల అకౌంట్లు, కంపెనీల వివరాలను స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రానికి సమర్పించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పన్ను ఎగవేతలు, నల్లధనానికి సంబంధించిన కేసులను పరిశోధించడానికి ఈ సమాచారం ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది.

 

Tags :