ఉల్లాసంగా సాగిన తానా అడ్‌హాక్‌ కమిటీ సమావేశం

ఉల్లాసంగా సాగిన తానా అడ్‌హాక్‌ కమిటీ సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అడ్‌హాక్‌ కమిటీ సమావేశం ఉల్లాసంగా సాగింది. జనవరి 12వ తేదీన జరిగిన ఈ సమావేశానికి తానా కార్యవర్గ సభ్యులు అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తానా అనుబంధ అడ్‌ హాక్‌ కమిటీలు మరియు సిటీ కోఆర్డినేటర్స్‌ హాజరయ్యారు. దాదాపు 110 మంది వరకు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుతోపాటు కార్యవర్గ సభ్యులు సతీష్‌ వేమూరి, అశోక్‌ బాబు కొల్లా, మురళి తాళ్లూరి, రాజా కసుకుర్తి, శిరీష తూనుగుంట్ల, ఉమ అరమండ్ల కటికి, శశాంక్‌ యార్లగడ్డ, సురేష్‌ కాకర్ల, సతీష్‌ కొమ్మన, రామ్‌ తోట, వెంకట్‌ మీసాల, రత్న ప్రసాద్‌ గుమ్మడి, వెంకట రమణ యార్లగడ్డ, విద్య గారపాటి, రవి సామినేని తదితరులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. తానా ముందు ముందు చేయబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే కొందరు అడ్హాక్‌ కమిటీ మరియు సిటీ కోఆర్డినేటర్స్‌ తమ ఆలోచనలు, సలహాలు అందించారు.
 

Tags :