చిన్నారులకు ప్రోత్సాహం... అబ్బురపరిచిన తానా బాలోత్సవం

చిన్నారులకు ప్రోత్సాహం... అబ్బురపరిచిన తానా బాలోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బాల బాలికల్లో సృజనాత్మకను వెలికి తీసి వారిలో లలిత కళల పట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచేందుకు వీలుగా తానా బాలోత్సవాన్ని-2022ను వైభవంగా నిర్వహించింది. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలో శిరీష తునుగుంట్ల సారథ్యంలో బాలోత్సవం చైర్మన్‌ దీపిక సమ్మెటతో పాటు బాలోత్సవం బృందం(బాలోత్సవం కో-చైర్‌ శ్రీనివాస్‌ ఉప్పు, సాయి బొల్లినేని, నాగ పచ్చమర్తి, వెంకట్‌ మీసాల, దిలీప్‌ ముసునూరు, హనుమత చెరుకూరి, సునీల్‌ కొల్లురు, వంశీ వాసిరెడ్డి, సుమంత్‌ రామిశెట్టి, రాజా కసుకుర్తి, రామ్‌ తోట, శ్రీనివాస్‌ ఉయ్యూరు, సిరి కొంపల్లి, పద్మ భోగవల్లి, శ్రీనివాస్‌ గోగినేని, కిశోర్‌ యర్లగడ్డ, ప్రదీప్‌ గడ్డం, మాధురి ఏలూరి, పద్మజ బేవర, రత్న గుమ్మడి, సతీష్‌ కొమ్మన, సౌజన్య పొట్టి, లక్ష్మీ కందిమల్ల, శిరీష కొంపల్లి, రవి వడ్లముడి) నెల రోజుల పాటు కష్టపడి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో పిల్లల్ని వారి వయసును బట్టి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు, 11 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు రెండు గ్రూపులుగా విభజించారు. సంగీతం(శాస్త్రీయం` సినిమా), నృత్యం (శాస్త్రీయం మరియు సినిమా), పద్య పఠనం, పబ్లిక్‌ స్పీచ్‌, ఫ్యాన్సీ డ్రెస్‌, రూబెక్‌ క్యూబ్‌ మొదలైన అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమెరికాలోని వందలాది బాల బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న చాలామంది బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం విశేషం. మొదటి రౌండ్‌ నుంచే ఫలితాల వెల్లడిలో నిర్వాహకులు పారదర్శకంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకున్నారు. ఫస్ట్‌ రౌండ్‌లో న్యాయనిర్ణేతల తీర్పు ప్రకారం జాబితాను ఫిల్టర్‌ చేశాక తుది పోటీలకు ఎంపికైన వారితో పోటీలను నిర్వహించడం జరిగింది. చివరి రౌండ్‌ పోటీల జాబితానుకూడా పబ్లిక్‌గా వెలువరించి వాటి నుంచి సరైనవారిని ఎంపిక చేయడం జరిగింది. 50శాతం జడ్జీల నుంచి 50 శాతం పబ్లిక్‌ పోలింగ్‌ ద్వారా స్వీకరించి ఫలితాలను వెల్లడి చేయడం జరిగింది.

ఆగస్టు 27న బాలోత్సవంముగింపు కార్యక్రమం అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, శిరీష తూనుగుంట్ల వ్యాఖ్యానంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ సినీ కధా రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరై తానా చేస్తున్న బహు ముఖమైన కార్యక్రమాల్ని తెలుసుకుని అభినందించారు. పిల్లల్లోని సృజనాత్మక శక్తులు వెలికి వచ్చే వేదిక ఈ బాలోత్సవమని, తెలుగు భాషను, సంస్కృతిని కాపాడేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నప్పుడు విదేశాల్లో ఇండియా ఇమేజ్‌ను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగిందన్నారు. తానా కూడా తనవంతుగా మన దేశ కీర్తిప్రతిష్టలను కాపాడేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా కోరుతూ ఈ విషయంలో భారత ప్రభుత్వం తరపున సహకారంకూడా ఉంటుందని చెప్పారు.

అంతకుముందు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా సాంస్కృతిక, క్రీడా, సామాజిక, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో చేస్తున్న సేవల గురించి వివరించారు. ఆ తర్వాత ప్రసంగించిన తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్‌ తాళ్లూరి బాలోత్సవం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ తన కుటుంబం తరపున భద్రాచలంలో నిర్వహించే బాలోత్సవ వేడుకలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం గౌరవ అతిథులుగా విచ్చేసిన ప్రఖ్యాత కూచిపూడి నర్తకీమణి స్వాతీ సోమనాధ్‌ మాట్లాడుతూ, మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని అందుకు తానా ముందుకు రావడం సంతోషంగా ఉందని చెబుతూ,  సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించేలా కార్యమ్రాలకు వేదికను కల్పించినందుకు తానాకు ధన్యవాదాలు తెలిపారు. లలిత కళలు అభిరుచి కోసం మాత్రమే కాదని అంటూ, మన ఆరోగ్య భద్రతలో కూడా ఎంతో ఉపయోగాన్ని అందిస్తుందని తెలిపారు. అందరూ సంప్రదాయ కళలను నేర్చుకోవాలని సూచించారు. తానా సభ్యులు కూడా తమ పిల్లలకు ఇలాంటి కళలను నేర్పించాలన్నారు. పిల్లలలో సృజనాత్మకత మరియు జ్ఞానం వంటివి పెరుగుతాయన్నారు.  ఇలాంటి అద్భుతాలను అందించిన తానాకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

సుప్రసిద్ధ జర్నలిస్ట్‌, యాంకర్‌ స్వప్న కూడా ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న మనవాళ్ళు తమ పిల్లలకు మన కళలను నేర్పించడంలో ఎల్లప్పుడూ ముందుంటున్నారని ప్రశంసించారు. తాను వాషింగ్టన్‌లోని సీటెల్‌లో పిల్లలకు క్లాసికల్‌ సింగింగ్‌ను నేర్పించే టీచర్‌గా పనిచేసిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. తల్లితండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ కళలను నేర్పించుకోసం ఎక్కడెక్కడ నుంచో డ్రైవింగ్‌ చేస్తూ పిల్లలను తీసుకువస్తున్నారని అంటూ, తానా ఇలాంటి పోటీల ద్వారా చిన్నారుల ప్రతిభను వెలికితీయడం సంతోషమని చెప్పారు. ఈ సందర్భంగా స్వప్న పాడిన అన్నమయ్య కీర్తన అందరినీ అలరించింది.  పద్మభూషణ్‌ రాజా రాధా రెడ్డి, శాస్త్రియ, సినీ నృత్యాల్లో విజేతల్ని, సినీ నేపథ్య గాయక దంపతులు పూర్ణిమ గోపిక, మల్లికార్జున రావులు పాటల పోటీ ఫలితాల్ని ప్రకటించారు. సుప్రసిద్ధ కవి, నటులు డాక్టర్‌ మీగడ రామ లింగస్వామి పద్యపఠనం ఫలితాల్ని ప్రకటించారు.

చివరగా బాలోత్సవ చైర్‌ దీపిక సమ్మెట వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా వ్యవహరించిన విద్య గారపాటి, జయ తాళ్లూరికి బాలోత్సవం బృందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

వివిధ పోటీల విజేతల వివరాలు

సంగీతం (శాస్త్రీయ మరియు సినిమా)

ఇషాన్వి శ్రీనివాస్‌, వేదార్క వసంత్‌, ఆద్విక సనిపిని, ప్రణతి భట్‌, స్నికిత లక్కిరెడ్డి, సాయి శరణ్య, అలేఖ్య యెర్నేని, శ్రీరామ కప్పగంతు, నికిత కొండపి, ఆద్య కేసన

నృత్యం (శాస్త్రీయ మరియు సినిమా)

జాహ్నవి బండారు, నవ్య ముంగర, రితిక కొల్లూరు, శాంతి వర్షిణి జలేం, కీర్తిక తుమ్మల, శ్రియ కేతినీడి, అన్విక వీరమాచనేని, శాన్వి ప్రియా తన్నీరు, యుక్తా దుబ్బిరెడ్డి, తనిష్క్‌ భీమనపల్లి, శ్రీవల్లభ్‌ పులగం, మన్యు దుబ్బిరెడ్డి.

పద్య పఠనం:

కీర్తన పర్వతనేని, ధర్షిత అక్షయ పదాల, శ్రీహిత్‌ మాజేటి, సహస్ర దరిసిపూడి, అలేఖ్య యెర్నేని, శ్రీనికా జైని

పబ్లిక్‌ స్పీచ్‌

ఈషా శ్రీ గోరంట్ల, కీర్తిక తుమ్మల, యశాస్‌ బల్గూరి

ఫ్యాన్సీ డ్రెస్‌:

శ్రీహిత్‌ మాజేటి, ధృతి మల్లు, సోహన్‌ కార్తీక్‌ పడాల

రూబెక్‌ క్యూబ్‌:

శ్రీహిత్‌ మాజేటి, అక్షత్‌ భాగీ, అద్వైత్‌ అత్తూర్‌, శ్రీకర్‌ మాజేటి, పృథ్వీ నాగళ్ల, సుబాంగ్‌ అడపాలా.

 

Tags :