MKOne Telugu Times Youtube Channel

దావోస్‌లో సీఎం జగన్ కు ఘన స్వాగతం

దావోస్‌లో సీఎం జగన్ కు ఘన స్వాగతం

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు స్విట్జర్లాండ్‌లో ఉంటున్న  తెలుగు ప్రజలు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరోఖ్యరాజ్‌ తదితరులు సాదర స్వాగతం పలికారు.

స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్‌, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించి కారులో దావోస్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు స్వాగతం పలికారు.

 

Click here for Photogallery

 

Tags :