అమెరికాలో రూ.100 కోట్లతో గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా ప్యాకేజింగ్ యూనిట్

అమెరికాలో  రూ.100 కోట్లతో గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మా ప్యాకేజింగ్ యూనిట్

అమెరికాలోని వర్జీనియాలో గ్రాన్యూల్స్‌ ఇండియా ఫార్మాస్యూటికల్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ను ప్రారంభించింది. వర్జీనియాలోని ప్రిన్స్‌ విలియమ్‌ కౌంటీలో 12.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో (దాదాపు రూ.100 కోట్లు) ఈ యూనిట్‌ నిర్మించినట్టు గ్రాన్యుల్స్‌ ఇండియా వెల్లడించింది. ఇప్పటి వరకు ప్యాకేజింగ్‌ కార్యకలాపాలకు అవుట్‌సోర్స్‌ చేసుకున్నామని, ఇకపై  సొంతంగానే ఈ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) నుంచి ప్యాకేజింగ్‌ వరకు అన్ని రకాల ఔషధ తయారీ కార్యకలాపాలను సొంతంగా నిర్వహిస్తున్నట్లు అవుతుందని గ్రాన్యూల్‌స ఇండియా ఎండీ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపారు.

 

Tags :