ఆటాపాటలతో ఉల్లాసంగా జిడబ్ల్యుటీసిఎస్ వనభోజనాలు...

ఆటాపాటలతో ఉల్లాసంగా జిడబ్ల్యుటీసిఎస్ వనభోజనాలు...

గ్రేటర్‍ వాషింగ్టన్‍ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్‍) వార్షిక వనభోజనాలు ఆటపాటలతో ఉల్లాసంగా జరిగింది. 47 ఏళ్లుగా అమెరికా రాజధాని వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిడబ్ల్యుటీసిఎస్‍ ఈసారి కూడా వార్షిక వనభోజనాల కార్యక్రమాన్ని బర్క్ లేక్‍ పార్క్ లో నిర్వహించింది. తెలుగువారి సంప్రదాయ వంటకాల ఘుమఘుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమంగా ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వంటలు, వాలీబాల్‍ పోటీలు నిర్వహించారు.

జీడబ్ల్యూటీసీఎస్‍ అధ్యక్షురాలు సాయి సుధా పాలడుగు మాట్లాడుతూ తెలుగు వారందరినీ ఒకచోటకు చేర్చి, ఒకరికొకరు అనే భావన కలిగించే ఆలోచనతో తాము ముందుకెళ్తున్నామని అందులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించే కార్యక్రమాలను కూడా చేస్తున్నామన్నారు. ఈ వనభోజన కార్యక్రమంలో డా. కొడాలి నరేన్‍, కంతేటి త్రిలోక్‍, మన్నే సత్యనారాయణ, మోపర్తి లక్ష్మి, ఉప్పుటూరి రాంచౌదరి, విజయ్‍ గుడిసేవ, ఉప్పలపాటి అనిల్‍, సత్య సూరపనేని, ఫణి తాళ్లూరి, భాను మగులూరు, లాం కృష్ణ, యష్‍, రవి, సుశాంత్‍ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :