తెలంగాణలో అమెరికా గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ

అమెరికాకు చెందిన గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ తమ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. గ్రిడ్ డైనమిక్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ యూనిట్ గురించి వివరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సంస్థ ఏర్పాట్లు వల్ల తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Tags :