అన్ని రాష్ట్రాలు అడిగితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం

అన్ని రాష్ట్రాలు అడిగితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం

జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు పొడింగించాలని అన్ని రాష్ట్రాలు అడిగితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. జీఎస్టీ నష్టపరిహారంలో నష్టపోయేలా కేంద్రానికి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ప్రజలపై భారాలు మోపుతున్నా నోరు మెదపరా అని నిలదీశారు. పుదుచ్చేరి, జార్ఖండ్‌ లాంటి రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించాయన్నారు. జగన్‌ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags :