దావోస్ లో జరిగే సదస్సులో .. ఏపీ తరపున

దావోస్ లో జరిగే సదస్సులో .. ఏపీ తరపున

దావోస్‌ సదస్సులో ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  దావోస్‌లో జరిగే సదస్సులో ఏపీ తరపున పెవిలియన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో కలిసి సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. దావోస్‌లో 18 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం లాగా మేము లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అబద్దాలు చెప్పమన్నారు. దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి సదస్సులను బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉందన్నారు.

 

Tags :