తెలంగాణ హ్యాండ్లూం చైర్మన్ గా గూడూరి ప్రవీణ్ బాధ్యతలు

తెలంగాణ హ్యాండ్లూం చైర్మన్ గా  గూడూరి ప్రవీణ్ బాధ్యతలు

తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌ (టీపీటీడీసీఎల్‌) చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని జౌళిశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కు మంత్రి కేటీఆర్‌ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

 

Tags :