వంశపారంపర్యం బాటలో బీజేపీ, కాంగ్రెస్

వంశపారంపర్యం బాటలో బీజేపీ, కాంగ్రెస్

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని గొప్పలు చెబుతున్న బీజేపీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం.  వంశపారంపర్య అధికారాన్ని విమర్శించే బీజేపీ పెద్దలు, తరచూ ఈ విషయంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను ఎన్నోసార్లు వేలెత్తిచూపారు. తమదాకా వస్తేగానీ తెలీదన్న చందనా, ఇప్పుడు గుజరాత్‌లో ఆ పార్టీ  సీనియర్‌ నేతలు తమ వారసులను బరిలోకి దించడాన్ని రాజకీయ విమర్శలు ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరపున కూడా అగ్రనేతల వారసులు బరిలోకి దిగారు. రెండు ప్రధాన పార్టీల నుంచి దాదాపు 20 మంది వారసులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఎన్ని విమర్శలు చేసుకున్నా, వంశపారంపర్య రాజకీయాలు దేశంలో ఒక సాంప్రదాయక లక్షమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి 13 మంది వారసులు పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ఏడుగురు బరిలో ఉన్నారు. బలమైన అభ్యర్థి పేరుతో, ప్రత్యామ్నాయ అభ్యర్థి లేని పరిస్థితుల్లో వారసులకే టిక్కెట్లు కేటాయించాల్సి వస్తోంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.