గుజరాత్‌ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎన్నిక

గుజరాత్‌ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎన్నిక

గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్‌ పటేల్‌ (59) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఎటువంటి ప్రచారం లేకుండానే ఈ ఎంపిక జరగడం వివేషం. పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో ఆయన పేరును ముఖ్యమంత్రిగా గద్దె దిగుతున్న విజయ్‌ రూపాణీ ప్రతిపాదించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు నమ్మకస్థుడైన భూపేంద్ర పటేల్‌ తొలి సారి ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గుజరాత్‌లో బీజేపీకి మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో అత్యధికులు సమావేశానికి హాజరయ్యారు. పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఢల్లీి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

Tags :